calender_icon.png 26 February, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మిణ్ ది గ్రేట్ పుస్తకావిష్కరణ

26-02-2025 12:53:38 AM

రచయిత, ఐఏఎస్ అధికారి నియాజ్‌ఖాన్

భోపాల్, ఫిబ్రవరి 25: “బ్రాహ్మణులు లేకుండా ఇతిహాసాలను ఊహిం చలేం. వేలా ది సంవత్సరాలుగా బ్రాహ్మణుల సేవలు దేశానికి అందుతున్నాయి. చాణక్యుడు, పరశురా ముడు, దదీచీ.. వంటి ఎందరో బ్రాహ్మణులు భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు. వారి విశిష్ట సేవలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ‘బ్రాహ్మి ణ్ ది గ్రేట్’ అనే పుస్తకం రాశాను.

నేను ముస్లింని అయినప్పటికీ బ్రాహ్మణులంటే నా కెంతో ఇష్టం. అం దుకే వారి గురించి పుస్తకం రాశాను’ అని రచయిత, ఐఏఎస్ అధికారి నియా జ్‌ఖాన్ అన్నారు. మధ్యప్ర దేశ్‌లోని ఉజ్జయిని మహాకాళ్ ఆలయ ప్రాంగణం లో మంగళవారం ఆయన శంకరాచార్య స్వా మి జ్ఞానానంద సరస్వతి, మహామండలేశ్వర్ కైలాసనంద్‌గిరి, అఖిల భారతీయ బ్రాహ్మణ్ సమాజ్ అధ్యక్షుడు సురేంద్ర చతుర్వుదితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

బ్రాహ్మణులు ఎప్ప టికప్పుడు త్యాగాలు చేస్తూ దేశాన్ని రక్షించినట్టు పేర్కొన్నారు. ముస్లిం అధికారి అర్థం చేసుకున్నట్టుగా బ్రాహ్మణుల గొప్పతనాన్ని బ్రాహ్మణ కుటుంబాల్లోనే పుట్టిన వారు, కొందరు హిందువులు అర్థం చేసుకోలేపోతున్నారని వక్తలు కొనియాడారు.