హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హైర్ ది బెస్ట్ బ్రెయిన్స్ ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్‌లో నిర్వహించిన బ్రాహ్మణ జాబ్‌మేళా విజయవంతమైందని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఆలూరి తెలిపారు. దాదాపు 5 వేల మంది బ్రహ్మణ నిరుద్యోగులు మేళాలో పాల్గొన్నారు. 150 మందికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందించగా, 850 మందిని వివిధ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తంగా వెయ్యికి పైగా బ్రాహ్మణ నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు.