calender_icon.png 20 September, 2024 | 4:16 PM

బాలికా విద్యకు బ్రహ్మరథం

12-07-2024 12:00:00 AM

ఐ.ప్రసాదరావు :

ఆనాడు భారతదేశంలో బాలికలకు, మహిళలకు విద్య అందించడానికి సావిత్రీబాయి ఫూలే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని తన ఆశయాన్ని ముందుకు నడిపింది. అటువంటి సంఘటనే నేటి కాలంలో ముస్లిం బాలికలు, మహిళల చదువుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడిన మలాల యూసఫ్ జాయ్ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె జన్మదినాన్ని ‘ఐక్యరాజ్యసమితి’ (ఐరాస) ఆధ్వ ర్యంలో ప్రపంచంలో పలు దేశాలు జులై 12న ‘ప్రపంచ మలాల దినోత్సవం’గా జరుపుతూ అనేక స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

1997 జులై 12న పాకిస్థాన్‌లోని ప్వాత్ లోయ మింగోరాలో జన్మించిన మలాల 11 ఏళ్ల వయసులోనే బాలికా విద్యపై వున్న నిషేధానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడారు. పెషావర్‌లోని స్థానిక ప్రెస్‌క్లబ్‌కు తండ్రి వెంట వెళ్లిన ఆమె, తాలిబన్లు తన ప్రాథమిక విద్యాహక్కును హరించడం పై చేసిన ప్రసంగం పాకిస్థాన్ అంతటా ప్ర చారంలోకి వచ్చింది. 2009 ఫిబ్రవరిలో మలాలా తన తొలి టెలివిజన్ షోలో కనిపించారు. పాకిస్థాన్ కరెంట్ ఈవెంట్స్ షో ‘క్యాపిటల్ టాక్’లో పాకిస్థానీ జర్నలిస్టు, టాక్ షో హోస్ట్ హమీద్ మీర్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. తాలిబన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాల చికిత్సకో సం బ్రిటన్ వెళ్లారు. అక్కడే తన కుటుంబంతో కలిసి స్థిరపడిన ఆమె తన విద్యా భ్యాసాన్ని కొనసాగించారు.

తన 16వ పుట్టిన రోజయిన 2013 జులై 12న ఐరాస సర్వసభ్య సమావేశంలో మలాల ప్రసంగించారు. ఆమెకు లభించిన అనేక అవా ర్డుల్లో 2013లో ‘ఐరాస మానవ హక్కుల పురస్కారం’ ఒకటి. అదే ఏడాది ‘టైమ్స్’ పత్రిక అత్యంత ప్రభావవంతమైన వ్యక్తు ల్లో ఒకరుగా మలాలను ఎంపిక చేసింది. బాలల హక్కుల కోసం కృషి చేసినందుకు 2014లో మన దేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి ‘నోబెల్ శాంతి బహుమతి’ని సైతం ఆమె అందుకున్నారు. నోబెల్ బహుమతిని గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగానూ మలాల చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్‌లో చదువును కొనసాగించిన మలాలా 2020లో ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ’ నుంచి పట్టా అందుకున్నారు. 2021లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లో పని చేసే అసీర్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు.  

ప్రపంచమంతా ఒక్కటై..

పాకిస్థాన్‌లోని బాలికల చదువు కోసం చిన్నతనం నుండి అనేక కార్యక్రమాలు చే పట్టి, తన కలాన్ని, గళాన్ని ధైర్యంగా, బహిరంగంగా వినిపిస్తున్న మలాలపై ఆనాటి పాకిస్థాన్ తాలిబన్లు 2012 అక్టోబర్ 9ను తుపాకీతో కాల్చి హత్య చేయడానికి య త్నించారు. స్కూలునుంచి వస్తున్న ఆమెపై తాలిబన్ మిలిటెంట్ కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన మలాల ప్రాణగం డం నుండి బయట పడి, తన ఆశయాన్ని మరింత బలంగా నేటికీ వినిపిస్తున్నది. ఆమె లక్ష్యసాధనకు అంద రూ ఒక్కటై తన కు బాసటగా నిలిచారు. మహిళలు, బాలికల చదువు, హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మలాల సేవలను ‘ఐరాస’ గుర్తించి 2015 నుంచి ప్రతీ సంవత్సరం జులై 12న ‘మలాల దినోత్సవం’ జరుపుకోవాల్సిందిగా ప్రకటించిం ది. మలాల తన తండ్రి సహకారంతో బాలికల చదువు, హక్కుల కోసం కంకణం కట్టుకుని పని ప్రారంభించింది. ఆమెకు యావత్ ప్రపం చం అండగా నిలుస్తున్నది. 2011 లోనే ‘బీబీసీ’ డాక్యుమెంటరీ చిత్రం నిర్మాణంలో తన జీవితగాథను, తాలిబన్ల్ల అరాచకాలను పంచుకుంది. మహిళలు, బాలికలపై తాలిబన్ల చేష్టలు, దాడులు వివరించింది. 

మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత

2012లో తన తండ్రి సహకారంతో 12 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న బాలికల చదువు కోసం మలాల ఫండ్ నిధిని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించి బాలికల విద్యకోసం శ్రమిస్తూ, అంతర్జాతీ యంగా గుర్తింపు పొందారు. సిరియా అంతర్యుద్ధంలో శరణార్థుల పిల్లలకోసం ఆమె మలాల ఫండ్ మద్దతుతో లెబనాన్‌లో ఒక బాలికల పాఠశాలను కూడా ప్రారంభించారు. అందువల్లే ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో 14 ఏళ్లకే నోబెల్ బహుమతి అందుకున్న మహిళగా తాను గుర్తింపు పొందారు. ఆమె ధైర్యం, స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బాలికలు, మహిళలు, మతం పేరుతో అణచివేతకు గురవుతున్నవారు, పరదాలు దాటి బయటకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. మలాల ‘ఐ యామ్ మలాల’ పేర్న పుస్తకం రాశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మత, సామాజిక పరమైన ఆంక్షలు ఉన్నా ఎదిరించి బాలికలు, మహిళల చదువు, హక్కుల కోసం నిరంతరం పరితపిస్తున్న మలాల ప్రపంచ మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

నేటికీ  ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశా ల్లో బాలికలు, మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్‌లో మహిళలపై ఆంక్షలు, మన దేశంలో కర్ణాటకలో హిజా బ్ ఉదంతం మనందరం చూసాం. భారతదేశంలో నేటికీ అనేక ప్రాంతాల్లో బాలికల చదువు అంతంత మాత్రంగానే ఉంది. మత, లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. పదవ తరగతి తరువాత బాలికల్లో ఎక్కువమంది ్ర‘డాప్ అవుట్’ అవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బాలికలకు పాఠశాలలు అందుబాటులో లేకపో వడం, టాయ్‌లెట్లు వంటి కనీస సదుపాయాలు కొరవడడం వల్ల ఆడపిల్లల చదు వు హైస్కూల్‌తో ముగించే పరిస్థితి నెలకొంది. బాల్య వివాహాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ర్యాగింగ్ పడగ విప్పుతున్నది. 

ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి

బాలికా పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు, గురుకుల విద్యాలయాలు తగినన్ని ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. బాలికా విద్యకు బడ్జెట్‌లో చాలినన్ని నిధులు మంజూరు చేయాలి. తగు స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. పోషకాహార లోపాల నివారణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. ప్రపంచంలో, దేశంలో దాదాపు సగం జనాభా మహిళలే. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆడపిల్లల చదువుపైనే ఆధారపడి ఉంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి దేశాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించగలుగుతుంది. వివిధ రంగాల్లో పురుషుల పనిభారాన్ని వారు పంచుకోగలుగుతారు. అందువల్ల బాలికలకు విద్య కుటుంబానికి, దేశానికీ ఓ వరం లాంటిది. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి చదువు వారికి దోహదపడుతుంది. తన హక్కులను, మహిళా సాధికారతను ఆమె గుర్తించగలుగుతుంది. చదువుకున్న మహిళ తన కుటుంబాన్ని చక్కదిద్దుకో గలుగుతుంది. దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందాలంటే మహిళలు, బాలికల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందనే వాస్తవాన్ని ఎవ్వరూ మరువరాదు. 

మన రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ‘ఒక దేశాభివృద్ధి మహిళల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అని చెప్పిన మాటలు అక్షర సత్యం. బాలికలు, మహిళల చదువు ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. మహిళలు, బాలికల రక్షణకు దిశ యాప్, మహి ళా పోలీస్, నిర్భయ చట్టం వంటివి ఉన్న విషయం తెలిసిందే. ఇవి చాలవు. మరెన్నో మెరుగైన చర్యలు తీసుకోవాలి. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే మహిళలపై రోజూ అనేక అమానుష దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు బాలికలు, మహిళల హక్కులు, రక్షణ, చదువు కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అందరం ముక్తకంఠంతో కోరుకుందాం. ‘ఒక శిశువు, ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, ఒక కలం ప్రపంచ చరిత్రను తిరగరాస్తాయి’ అని మలాల చెప్పిన మాట లు నిజం చేద్దాం. ఇకనైనా ప్రపంచంలో, దేశంలో అనేకచోట్ల మహిళలపై ఉన్న ఆంక్షలు, వివక్షతలను తొలగించి మలాలా యూసఫ్ జాయ్ ప్రాణానికి తెగించి అం దించిన స్ఫూర్తితో ప్రపంచ దేశాలన్నీ ముందుకు సాగాలి.

        సెల్: 6305682733

నేడు మలాల అంతర్జాతీయ దినోత్సవం