calender_icon.png 24 September, 2024 | 3:58 AM

కామారెడ్డిలో సందడి చేసిన బ్రహ్మానందం

24-09-2024 01:46:07 AM

బాంబే క్లాత్ షాపింప్ మాల్ ప్రారంభం

కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం సోమవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాంబే క్లాత్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. సుమారు 15 నిమిషాల పాటు బ్రహ్మానందం ఇక్కడి సందడి చేశారు. ప్రారంభోత్సవంలో షోరూమ్ యజమానులు వీటి లాల్, వీటి రాజ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.