ఉపనిషత్ సుధ :
“నచికేతా! ఇంత చిన్న వయసులో నీ సత్యాన్వేషణ ఆసక్తిని చూ స్తుంటే మహదానందం కలుగుతున్నది. నే ను సైతం ప్రాపంచిక భావనలను అధిగమించిన తర్వాతే ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారిం చాను. ఈ స్థితిని సాధించాను. కానీ, నీ స త్యాన్వేషణ ఇంత చిరుప్రాయంలో ప్రారం భం కావటం అరుదైన విషయం. నీ కంటే ఆ త్మవిద్యను పొందగల అర్హులు ఇంకెవరున్నారు? విను!...
‘నేను బ్రహ్మమును’ అన్న భావన ప్రధా నం. ఆ భావన స్థిరంగా, నిశ్చలంగా, నిర్మలం గా ఉండాలి. బ్రహ్మ భావనే ఆత్మవృత్తులను స్పర్శా మాత్రంగా అనుభవ రూపంగా అనుగ్రహిస్తుంది. మనోవృత్తులన్నీ వృత్తికీ ప్రవృ త్తికీ లోబడినవే! చిత్తవృత్తులన్నీ పురాతనమైనవి. గతజన్మకు సంబంధించినవి. వీడని నీ డలవలె, కదలని వాసనలవలె వెన్నంటి ఉంటయ్. ఆత్మకు కూడా వృత్తులున్నయ్. అవి కా లాతీతమైనవి. అవి ప్రేరకశక్తులు. అవి సున్నితమైనవి. సూక్ష్మసూకే్ష్మతరమైనవి. పది ఇం ద్రియాలను, మనసును నడిపించగల సమర్థమైనవి. శక్తివంతమైనవి. ఆత్మవృత్తుల ప్ర భావంతో ఎవరిమీదా, దేనిమీదా ఆధారపడని సంపూర్ణ స్వేచ్ఛ, విముక్తి కలిగి, శుభేచ్ఛ ఏర్పడుతుంది.
ఇటువంటి సమ్యక్ భావనకే ధ్యానం లేదా ధీయానం అని పేరు. ధ్యానం చేయటమంటూ లేదు. ఏమీ చేయక పోవట మే ధ్యానం. సాక్షీభూతంగా ఉండగల అద్భు త స్థితి ధ్యానం. ఇది పరమానందాన్ని, బ్ర హ్మానందాన్ని ఆత్మానందాన్ని కలిగిస్తుంది. ఇక్కడే ఆత్మస్పర్శ మలయ పవనంలా, మనసును తాకుతుంది. క్రమంగా ఆ అనుభవ మూ సమసి, మనసు తన మూల స్థానమైన హృదయంలో లయమవుతుంది. ఇది ఆత్మనిష్ఠ! ఆత్మానుభవం! ఆనందసిద్ధి! అమరత్వలబ్ధి!
మదం నశించి దమం కలిగి, మనోనిగ్ర హం సహజస్థితి అవుతుంది. ఆ కారణంగా అహంకారం, అహంస్ఫురణవుతుంది. అదే ఆత్మానుభవంగా నిలకడ చెందుతుంది. ఇం ద్రియ నిగ్రహంతో, శమం కారణంగా అ హం మలగి ఆత్మానుభవం వెలుగుతుంది. మనుష్య, మనీషా, గంధర్వ, మానవ గం ధర్వ, దేవ గంధర్వ, ప్రజాపితానంద, హిరణ్యగర్భానందాలను, ఈ స్థితి కలిగిస్తుంది. ఇ ది ఆనంద పరిమళ భరితమైంది. పరమ పావనమైంది. పవిత్రమైంది.
భౌతికానందా న్ని మించి, కళాత్మకానందాన్ని దాటి, ఆత్మానందాన్ని అందుకున్న వాడికి ప్రాపంచిక వస్తువులపట్ల ఆసక్తి పూర్తిగా నశించి, రసానుభూతి సానందమై అనుభవంలోకి వస్తుం ది. అటువంటి రసాత్మక స్థితిని దైవంగా సం భావించి, ఆ దైవమే సత్ చిత్ ఆనంద రూపమని, సాలోక్య సామీప్య సారూప్య స్థితుల లో దానిని అనుభవిస్తాడు. కడకు అదే తానవుతాడు! ఇది శుద్ధాద్వైత స్థితి!...” చెప్పుకు పోతున్నాడు యముడు. “ధర్మ ప్రభూ! సూటిగా అడుగుతున్నాను. బ్రహ్మం అంటే ఏమిటి?” అడిగాడు నచికేతసుడు.
“నచికేతసా! ఓం కారం బ్రహ్మానికి చెంది న శబ్ద స్వరూపం. అకార, ఉకార, మకారమ నే బీజాక్షరాలతో ఉన్న ఈ ప్రణవం కేవలం శబ్దమే కాదు. దాని అర్థమూ బ్రహ్మమే! ఇది సంకేతాత్మకం కాదు. ఇది అక్షర స్వభావం. దీనికి మరణం తెలియదు. కనుక, పుట్టుకా తెలియదు. ఇది ఆద్యంత రహితమైంది. నిత్య సత్య శాశ్వతమైంది. అమదానందమైంది. అదే ఆత్మ! అదే ఈశ్వరుడు!! ఈ బ్రహ్మ భావనను పొందిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు” ముగించాడు యమధర్మరాజు.
“ప్రభూ! అంతా ఆత్మే అయినపుడు మా నవ ప్రయత్న అవసరం ఉన్నదా? జీవప్రజ్ఞను ఎలా వినియోగించాలి?” అడిగాడు నచికేతసుడు. యముడి ముఖమండలం ఆనందార్ణవమైంది! నచికేతసుడి జిజ్ఞాస ఆయనకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నచికేతసుడు ఆతృతతో ఎదురు చూస్తున్నాడు, సమాధానం కోసం....
- వీయస్‌ఆర్ మూర్తి