calender_icon.png 3 February, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా బీజేపీ అధ్యక్షులుగా బ్రహ్మానంద్...

03-02-2025 06:55:46 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా పతంగే బ్రహ్మానంద్ ని నియమించారు. ఈ మేరకు తెలంగాణ సంఘటన వర్క్ ఎన్నికల నియమావళి ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి బస్వాపురం లక్ష్మీనరసయ్య చేతుల మీదుగా హైదరాబాద్ లో నూతన అధ్యక్షుడు బ్రహ్మానంద్ సోమవారం నియామక పత్రాలను స్వీకరించారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చిన రాష్ట్ర నాయకులకు, దీనికి సహకరించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా నాయకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని నూతన అధ్యక్షుడు బ్రహ్మానంద్ అన్నారు. జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.