ప్రజాభవన్‌లో ఫిర్యాదు
కరీంనగర్, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని బ్రాహ్మణకుంట చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. బ్రాహ్మణ కుంట చెరువు శిఖం భూమిని కబ్జా నుంచి కాపాడాలని శుక్రవారం కరీంనగర్‌కు చెందిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ చెరువు శిఖం భూమిని కాపాడాలని కరీంనగర్ ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని, అందుకే హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.