calender_icon.png 19 April, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది రతన్‌జీ మృతి

09-04-2025 01:24:10 AM

  1. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్, గవర్నర్ 
  2. ఆమె మరణం విశ్వ ఆధ్యాత్మికతకు తీరని లోటు

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీజీ మంగళవారం కన్నుమూశారు. గత వారం రోజులు గా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని అబూరోడ్‌లోని శాం తివన్‌లోని ట్రామా సెంటర్‌కు వై ద్యం కోసం తరలించారు.

దాది రతన్‌జీ పరిస్థితి మరింత విషమంగా మారి మంగళవారం తెల్లవారు జా మున మృతిచెందారు. ఆమె మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు. ‘దాదిజీ జీవితం ఆదర్శవంతం. ఆమె ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు’ అని సీఎం రేవంత్ కొనియాడారు.  దాది రతన్‌జీ మృతిపై గవర్నర్ స్పం దిస్తూ.. ‘ఆమె ఒక ప్రకాశవంతమైన మార్గదర్శి. ఆమె మరణం ఆధ్యాత్మిక సేవా రంగానికి అపారమైన నష్టం’ అని తెలిపారు.