సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ధరించిన ఐకానిక్ గ్రీన్ క్యాప్‌కు వేలంలో రికార్డు ధర పలికింది. మంగళవారం హౌస్ బొన్హమన్ నిర్వహించిన వేలంలో బ్రాడ్‌మన్ క్యాప్ రూ.2.63 కోట్ల ధరకు అమ్ముడవ్వడం విశేషం. ఈ క్యాప్‌ను బ్రాడ్‌మన్ 1947 స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా ధరించాడు.
బ్రాడ్‌మన్‌కు అదే చివరి సిరీస్ కావడం విశేషం. సమకాలీన క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన సర్ డాన్ బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలున్నాయి. టెస్టుల్లో బ్రాడ్‌మన్ సాధించిన 12 డబుల్ సెంచరీల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో బ్రాడ్‌మన్ క్యాప్‌కు రికార్డు ధర పలకడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.