calender_icon.png 31 October, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

31-10-2024 02:02:02 AM

  1. 24 మందితో పాలకమండలి
  2. తెలంగాణ నుంచి 5గురికి స్థానం

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మం ది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం  బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది.

తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనా డు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకా శం కల్పించారు. బోర్డులో ఈసారి సగం మంది పొరుగు రాష్ట్రాల వారే. కాగా  ఏపీ ప్రభుత్వం మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది.  

టీటీడీ బోర్డు సభ్యులు..

సాంబశివరావు (జాస్తి శివ), శ్రీ సదాశివరావు నన్నపనేని, ఎంఎస్ రాజు (మ డకశిర ఎమ్మెల్యే), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), ప్రశాంతిరెడ్డి (కొవ్వూ రు ఎమ్మెల్యే), పనబాక లక్ష్మీ (కేంద్ర మా జీ మంత్రి), మల్లెల రాజశేఖర్‌గౌడ్, జంగా కృష్ణమూర్తి, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్‌దేశాయ్, శ్రీసౌరభ్ హెచ్ బోరా, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, దర్శన్ ఆర్‌ఎన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, పీ రామ్మూర్తి, జానకీదేవి తమ్మిశెట్టి.

తెలంగాణ నుంచి...

నన్నూరి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బురగపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లా.

 బోర్డుకు సీఎం అభినందనలు

టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమితులై న బీఆర్ నాయుడుకు,  సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.