14-04-2025 07:40:54 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు బూర్గంపాడు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన బూర్గంపాడులో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీడీవో జమలారెడ్డి, ఇన్చార్జ్ ఎంపిఓ బాలయ్య, సెక్రటరీ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే మండలంలోని పినపాక పట్టి నగర్,మొరంపల్లి బంజర్,సారపాక,కృష్ణ సాగర్ గ్రామాల్లో యువజన సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.