calender_icon.png 16 April, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

14-04-2025 06:47:46 PM

చిలుకూరు: చిలుకూరు మండల వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, బిజెపి ఆధ్వర్యంలో జై జై నగర్ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నిర్వహించారు.  ఈ   కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

వారు మాట్లాడుతూ... భారత ప్రజాస్వామ్యనికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహానీయుడు, సమ సమాజ స్వప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మల్లేపంగు  సూరిబాబు మాదిగ, ఎమ్మెస్ పి కోదాడ టౌన్  మైనార్టీ నాయకులు షేక్ మౌలానా, జిల్లా శ్రీను, మల్లేపంగు ఉపేందర్, యువనాయకుడు కందుకూరి రాకేష్, నూకపంగు మణికంఠ, మల్లేపంగు అశోక్, ముదిగొండ సైదులు, మల్లేపంగు వీరబాబు, కందుకూరి శ్రీను, నందిగామ తిరపయ్య, ముదిగొండ ఉదయ్, నూకపంగు పవన్, గజ్జి నవీన్,సిద్దెల వంశీ, సిద్దెల రాజు,ముదిగొండ నాగయ్య, నేలమర్రి రాములు, వడ్డపల్లి సిద్దు,ముదిగొండ అవంతిక, మరియు తదితరులు పాల్గొన్నారు.