calender_icon.png 16 April, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి

14-04-2025 07:13:18 PM

మునగాల: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని మండలంలో వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలో ఎమ్మార్వో వెలుగొండ ఆంజనేయులు రమేష్ దీన్ దయాల్, ఎస్సై ప్రవీణ్ కుమార్ వివిధ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సభ జరిగినది.ఈ సందర్భంగా పలువురు నాయకులు పెద్దలు మాట్లాడుతూ... భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆయన అనేక అనగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కుల్ని కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.

మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అందరికీ విద్య వైద్యం ఉచితంగా అందించాలని ఉపాధి కల్పించాలని  ప్రతి ఒక్కరు కూడా చదువుకొని రాజ్యాంగ హక్కుల ద్వారా అందరు  ఎదగాలని కోరుకున్న మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జాపాల్ రెడ్డి. మార్కెట్ కమిటీ నెంబర్ కాసర్ల కోటయ్య. గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈధరావు. టిఆర్ఎస్ నాయకులు కందిబండ సత్యనారాయణ. ఉడుం కృష్ణ ఎల్  రామయ్య. బుర్రి శ్రీరాములు. బచ్చలకూరి స్వరాజ్యం. స్టాలిన్ రెడ్డి అంజయ్య. నాగరాజు. శ్రీను తదితరులు పాల్గొన్నారు.