calender_icon.png 23 January, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

73 శాతం తగ్గిన బీపీసీఎల్ నికరలాభం

20-07-2024 01:05:22 AM

న్యూఢిల్లీ, జూలై 19: రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడం, మార్కెటింగ్ మార్జిన్లు తగ్గడంతో పెట్రో  కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 73 శాతం క్షీణించింది. ఈ ఏప్రిల్‌జూన్ క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.2,841 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో రూ.10,644 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరల్ని అధికస్థాయిలో కొనసాగించినందున బీపీసీఎల్ భారీ లాభాల్ని ఆర్జించింది. అయితే ఈ ఏడాది ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరల్ని లీటరుకు రూ.2 చొప్పున తగ్గించడం, ఇదే సమయంలో క్రూడ్ ధరలు పెరగడంతో కంపెనీ లాభదాయకత పడిపోయింది. అలాగే రిఫైనింగ్ మార్జిన్లు సైతం తగ్గాయి. నిరుడు బీపీసీఎల్  బ్యారల్‌కు 12.64 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్‌ను సంపాదించగా, అది ఈ ఏప్రిల్ 7.86 డాలర్లకు తగ్గింది.