calender_icon.png 21 April, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయం కోసం పదవులను వదులుకున్న వ్యక్తి బీపీ మండల్

14-04-2025 12:47:02 AM

ఆయనకు భారతరత్న ఇవ్వాలి

బీపీ మండల్ వర్ధంతి సభలో వక్తలు

ముషీరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : సామాజిక న్యాయం కోసం పదవులను వదులుకున్న వ్యక్తి బీపీ మండల్ అని ఆయన మనువడు సూరజ్ మండల్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీసీ ఐక్య వేదిక చైర్మన్ బేరి రామచంద్రయాదవ్ తదితర వక్తలు అన్నారు. బీపీ మండల్ వర్ధంతి, ఆయన జ్ఞాపకార్ధం నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి వారు మాట్లాడుతూ తనకు అవకాశం వచ్చిన సీఎం పదవిని తృణప్రాయంగా వదులుకుని, బీసీ కమిషన్ ఛైర్మన్‌గా బీపీ మండల్ సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి 40సిఫారసులను చేశారన్నారు.

ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వాటిలో రెండు ,మూడు మాత్రమే అమల్లోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను అందజేశారు.  కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, బీసీ సంఘాల నాయకులు చిన్న శ్రీశైలంయాదవ్,  గడ్డం శ్రీనివాస్‌యాదవ్, ఒట్టే జానయ్య, మేకల రాములు, మేకల లలిత, విష్ణుప్రియ, అంబర్‌పేట శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.