calender_icon.png 20 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీపీ మండల్‌కు ఘన నివాళులు

25-08-2024 07:28:51 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,ఆగస్టు25 (విజయకాంతి): జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ భవన్ లో ఆదివారం బీపీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ బీపీ మండల్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీల అభివృద్ధి కోసం జీవితకాలం పరితపించిన వ్యక్తి బీపీ మండల్ అని రూపునర్ రమేష్ అన్నారు. మండల్ అతని రాజకీయ జీవితం కాంగ్రెస్ లో  మొదలై 1952లో మొదటిసారిగా బీహార్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. బీపీ మండల్ బీసీల అభ్యున్నతి కోసం ఆనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు.