యాదాద్రి భువనగిరి,( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ రిజర్వేషన్ల పితామహుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్ బీపీ మండల్ 106వ జయంతిని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి అధ్యక్షత వహించి మాట్లాడుతూ... బీసీల అధ్యుడు (బీపీ మండల్) బిందెశ్వరి మండల ప్రసాద్ ఉత్తర ప్రదేశ్ లో 25 ఆగస్టు 1918లో జన్మించారు. బీహార్ లోని మాదాపూర్ జిల్లా మోరి గ్రామంలో ఆయన పెరిగారు. 1952లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తొలిసారి గెలుపొందారు.
బలహీన వర్గాలైన కుర్మిలపై అగ్రవర్ణ రాజపుత్రుల దాడులను ఖండించారు. ఈ దాడులపై అసెంబ్లీలో మాట్లాడానికి నాడు అసెంబ్లీలో బీహార్ సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అనంతరం సంయుక్త సోషలిస్టు పార్టీని స్థాపించారు. బీహార్ లో ఏడవ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే 1978లో మండల కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 డిసెంబర్ 31న నివేదిక కూడా సమర్పించారు. ఆ నివేదిక పది సంవత్సరాల తర్వాత వీపీ సింగ్ ప్రధాని కలిసి మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరారు. ఈ రకంగా ఆయన ఎన్నో సేవలను బీసీల కోసం అందించడం జరిగింది ఆయన ఆదర్శంగా మనమంతా తీసుకోవాలని బీసీలను కోరారు.