14-04-2025 12:00:00 AM
మునగాల ఏప్రిల్ 13, సూర్యాపేట జిల్లా మునగాల;- యాదవ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోని బషీర్బాగ్ లో ని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందెశ్వర్ మండల్ ప్రసాద్ (బీపీ మండల్) అవార్డులను సామాజిక సేవ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తించి రాష్ట్రస్థాయిలో అవార్డులను ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ బిపి మండల్ మనవడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ అవార్డు గ్రహీత బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ను సన్మానించి అవార్డు అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వారికి బీపీ మండల్ ఎంతో సేవ చేశారని వారికి గుర్తింపుగా బీపీ మండల అవార్డు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు వట్టై జానయ్య యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ బేరి రామచందర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.