30-04-2025 07:40:46 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలు ప్రైవేటు పాఠశాలలో మొత్తం 533 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 512 మంది పాస్ అయినట్లు మొత్తం మీద 97% ఉత్తీర్ణత సాధించినట్టు మండల విద్యాధికారి బోయిన లింగయ్య తెలిపారు. రెసిడెన్షియల్ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన కే సాయిరెడ్డి మండలంలో అత్యధికంగా 570 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. దీనితో ఆయన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల కష్టపడి చదివినప్పుడే మంచి మార్కులు సాధించే పాఠశాలకు గురుకులాలకు గుర్తింపు తేవాలని కోరారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాల, గురుకులాలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు.