calender_icon.png 26 October, 2024 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భవతిని చంపి, పాతిపెట్టిన బాయ్‌ఫ్రెండ్

26-10-2024 10:34:07 AM

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రేమించిన వాడే కాల యముడై గర్భవతిని దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు. గర్భవతి అయిన యువతి బాయ్ ప్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ అతను అబార్షన్ చేయించాలనుకున్నాడు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. 19 సంవత్సరాల వయస్సు గల పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో నివసించే సోనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు 6,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె, ఆమె ప్రియుడు సంజు అకా సలీమ్‌తో కలిసి అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసారు. ఆమె గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సలీమ్ పోస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సోని కొత్తగా స్నేహం చేస్తున్నదని తమకు తెలుసునని, అయితే ఆమె ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే, దెయ్యంతో అని చెప్పేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.