06-03-2025 03:45:11 PM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ప్రేమించిన యువతి ఇంటి వద్ద ఓ యువకుడు(Boyfriend) ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు(Mailardevpally Police Station) తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లి కి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. అతడు లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ బృందావనం కాలనీకి చెందిన ఎల్ఎల్బి(LLB Student) చదువుతున్న యువతి (21) మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా యువతి సోను ను కాదనడంతో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం యువతి ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసి ఫ్లోర్ క్లీనర్ తాగాడు. స్థానికులు గమనించి 100కు ఫిర్యాదు చేయడంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్న పెట్రోల్ మొబైల్ యువకుడ్ని మొదటి అంతస్తు పైనుంచి కిందికి దించి వెంటనే 108 అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.