09-04-2025 12:57:57 AM
తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలిపిన న్యాయవాదులు
మహబూబ్ నగర్ ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో సయ్యద్ మస్తాబా అలీపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదులు విడుదలను బహిష్కరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి నేతృత్వంలో విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు కోర్టు ప్రాంగణం నుండి ప్రాంగణం బయట వరకు ర్యాలీగా వెళుతూ నినాదాలు చేశారు. న్యాయవాదుల దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోర్టు బయట నుండి పెద్ద ఎత్తున నినాదాలతో తెలంగాణ చౌరస్తాకు చేరుకున్నారు అక్కడ నిరసన తెలియజేసి పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ పాలు దఫాలుగా న్యాయవాదులపై దాడులు జరగడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులపై దాడులు చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు ఉపాధ్యక్షుడు వెంకటయ్య కోశాధికారి వెంకట్రావు, సంయుక్త కార్యదర్శి నాగోజి, ఇతర కార్యవర్గ సభ్యులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.