09-12-2024 09:53:37 AM
అమరావతి: నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదని ఇంటర్ చదుతున్న బాలికను బాలుడు హత్య చేశాడు. ఇంట్లో నిద్రస్తున్న బాలికపై పెట్రోల్ పోలి నిప్పంటించాడు. బాలిక అరవకుండా నోట్లో దుస్తులు కుక్కాడు. బాలికను చంపిన అనంతరం బాలుడు నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు బాలుడికి దేహశుద్ధి చేశారు. స్థానికుల నుంచి తప్పించుకుని బాలుడు ఆస్పత్రికి వెళ్లాడు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, బాలుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.