22-02-2025 12:05:52 AM
కాపాడిన హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది
హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 21(విజ య క్రాంతి): మాసాబ్‌ట్యాంక్, శాంతి నగ ర్‌లోని ఓ అపార్ట్ శుక్రవా రం ఆరేండ్ల బాలు డు లిఫ్ట్‌లో చిక్కుకొని విలవిలలాడాడు. అపార్ట్‌మెంట్ వాసులు అగ్ని సిబ్బందికి సమచారమివ్వడంతో డీఆర్‌ఎఫ్ బృందం పదినిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని.. లిఫ్ట్‌కు కరెంట్ సరఫరా నిలిపేసి ఆపరేషన్ చేపట్టారు.
గ్యాస్ కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పనిముట్లతో లిఫ్ట్ ఫ్రేమ్‌ను కట్ చేసి బాలుడిని కాపాడారు. అప్పటికే ఆ బాలుడు స్పృ తప్పడంతో అతడ్ని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
మరమ్మతుకు వచ్చి..
జనగామ (విజయక్రాంతి): వరంగల్‌లోని స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయత్రి హోటల్‌లో లిఫ్ట్ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేసేందుకు వచ్చిన అంజి అనే వ్యక్తి లిఫ్ట్ కింద ఇరుకున్నాడు. మూడు గంటల పాటు నరకయాతన పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించారు. గోడకు రంధ్రం చేసి లిఫ్ట్ కింద ఇరుక్కున్న అంజిని ప్రాణాలతో బయటికి తీశారు.