హోమో సెక్స్ బయట పడుతుందని హత్య
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల్ గ్రామానికి చెందిన బాలుడు రిషి(12) హత్య కేసులో నిందితుడు తోకల రాజేశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తోకల రాజేశ్వర్ చిట్యాల్‌లోని కల్లుబట్టిలో కల్లు తాగాడు. మద్యం మత్తులో కామవాంఛ తీర్చుకునేందుకు రిషితో బలవంతగా హోమో సెక్స్ చేయించుకున్నాడు. ఈ విషయం బాలుడు బయటకు చెపుతాడనే భయంతో బండరాయితో మోది హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.