calender_icon.png 30 October, 2024 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

25-07-2024 12:33:43 AM

హనుమకొండ, జూలై 24 (విజయక్రాంతి): వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాసాని మనోజ్ కుమారుడు మూడేళ్ల నిహాన్ ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన వీధి కుక్కలు దాడి చేసి నుదుటితోపాటు ముక్కుపై కరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు కుక్కలను తరమడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మేరకు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.