30-04-2025 12:58:20 PM
హుజురాబాద్,విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం(Ellanthakunta Mandal) కనగర్తి గ్రామంలో బుధవారం ఉదయం బాలుడు పై వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామంచ. అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీదికుక్క ఒక్క సారిగా దాడి చేసింది. దీంతో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. గ్రామ ఫరిధిలో ఇటీవల కూడా ఇద్దరు పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందని, అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కల సమస్యకి పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.