21-02-2025 07:36:25 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తూ మధ్య లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు. తల్లిదండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడిని బయటికి తీశారు. నడుము భాగం లిప్ట్ లో ఇరుక్కుపోవడంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ప్రాథమిక చికిత్స నిమిత్తం బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.