10-02-2025 07:26:33 PM
పాపన్నపేట: విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఢాక్యాతండా గ్రామ పంచాయతీ పరిధి ధనూజ తండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని నర్సింగరావుపల్లి తండాకు చెందిన కేతావత్ లక్ష్మణ్ పెద్ద కొడుకు అనిరుధ్ (5) ఆదివారం లక్ష్మణ్ బావమరిది నిశ్చితార్థం నిమిత్తం ఇదే మండలం ధనుజాతండాకు వెళ్లారు. అనిరుధ్ స్పీకర్ బాక్సుల ఆటో వద్ద ఉన్న ఓ వైర్ ను చూడకుండా దానిపై కాలు పెట్టడంతో విద్యుత్ షాక్ కు గురై కిందపడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.