వివాహా వేడుకలలో అపసృతి
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): వివాహా వేడుకలలో అపసృతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో పదేండ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పోచారం ఐటీసీ పోలీసు స్టేషన్ పరిధి యంనంపేట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ ఇడబ్ల్యూఎస్ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల నర్సింహ్మ పోచారం మున్సిపాలిటీ లో వాటర్ మెన్ గా పని చేస్తున్నాడు. కాగ నవంబర్ 7న నర్సింహ్మ పెద్దనాన్న కొడుకు మీసాల శ్రీశైలం వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి ఇడబ్ల్యూఎస్ కాలనీలో విందు ఏర్పాటు చేశారు. విందు వేడుకల సందర్భంగా వేధిక చుట్టు లైట్లు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలలో నర్సింహ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. అక్కడే ఆడుకుంటున్న నర్సింహ్మ కుమారుడు మీసాల కేతన్ రాం(10)కు లైట్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తాకటంతో పార్టు సర్క్యూట్ తో కింద పడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం ఘట్ కేసర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విందు వేడుకల సందర్భంగా వేధిక చుట్టు మేడిపల్లికి చెందిన కేతావత్ వినోద్ లైట్లు ఏర్పాట్లు చేశారు. లైట్ల ఏర్పాటులో తగు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పార్టు సర్క్యూట్ అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడితండ్రి నర్సింహ్మ. ఫిర్యాదు మేరకు లైట్లు ఏర్పాటు చేసిన కేతావత్ వినోద్ నాయక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.