నాగర్‌కర్నూల్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): పొలం చదును చేస్తు న్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి ట్రా క్టర్‌పై కూర్చున్న బాలుడు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన సొంత ట్రాక్టర్‌తో ఓ రైతు పొలంలో కరిగెట చేసేందుకు గ్రా మానికి చెందిన మహేశ్(16)ను వెంటబెట్టుకుని వెళ్లాడు. కరిగెట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రోటావేటర్ కలిగిన ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకగా ట్రాక్టర్‌పై కూర్చున్న మహేశ్ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పోలీసు లు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.