హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): అన్నదమ్ములు ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ఉండ గా, చేతిలోని తాడు మెడకు బిగుసుకుపోయి తమ్ముడు మృతిచెందిన ఘ టన నగరంలోని బోరబండ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ సీఐ నాగుల్‌మీరా తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ బంజారానగర్‌కు చెందిన రహేనా బేగం చిన్న కుమారుడు తౌఫీక్ పాషా తాండూరు మదర్సాలో చదువుకుంటున్నాడు.
మదర్సా నుంచి శుక్రవారం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు. శనివారం మధ్యాహ్న సమయంలో తమ్ముడు ముదాసిర్ (13) అన్న తౌఫీక్ పాషాతో కలిసి తాడుతో ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో ముదాసిర్ మెడకు తాడు బిగుసుకుపోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.