calender_icon.png 25 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం వికటించి బాలుడు మృతి

24-03-2025 12:36:00 AM

చందానగర్‌లోని విష్ణు పారమిత హాస్పటల్‌లో ఘటన

శేరిలింగంపల్లి, మార్చి 23 (విజయక్రాంతి): ఇంజెక్షన్ వికటించి నాలు గేళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని విష్ణు పారమిత హాస్పటల్ చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4) తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్ర పురంలో నివాసం ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

కుమారుడు జాన్సన్‌కు వాం తులు కావడంతో ఆదివారం మధ్యా హ్నం చందానగర్‌లోని విష్ణు పారమి త ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని చెక్ చేసిన వైద్యులు అనారోగ్యానికి సంబంధించిన మెడిసిన్ బైటకు రాసి పంపారు. ఇంతలో డ్యూటీలో ఉన్న డాక్టర్ బయటకు వెళ్లిన బాలుడి తం డ్రి ఇంజెక్షన్ తెచ్చేలోపే మరో ఇంజెక్షన్ బాలుడికి ఇవ్వడంతో అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందాడు.

దీం తో బాలుడు కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వలనే మా కుమారు డి ప్రాణాలు పోయాయని హాస్పిటల్ ఎదుట న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. అయితే ఈ హాస్పిటల్ చందానగర్ జాతీయ రహదారిపై ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న చందనగర్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.