27-03-2025 11:06:42 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): ట్రాక్టర్ ట్యాంకర్ కింద పడి 12 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జిన్నారం మండలం మాదారం గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... మాదారం గ్రామంలో నివాసం ఉండే గంగారాం అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం సందీప్(12) అనే బాలుడిని ట్రాక్టర్ ఇంజన్ కు ట్యాంకర్ కు మధ్యలో ఎక్కించుకొని అజాగ్రత్తగా... వేగంగా నడపగా బాలుడు కాలు జారి కింద పడిపోయాడు. బాలుడి పైనుంచి ట్రాక్టర్ చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ గంగారాంపై కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.