calender_icon.png 22 February, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి

16-02-2025 12:28:19 AM

చార్మినార్, ఫిబ్రవరి 15: ఇంటి నిర్మాణం కోసం తొవ్విన పిల్లర్ గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రం  జిల్లా మాడ్గుల మండలం తాండకు చెందిన శ్రీను నాయక్, అనూష భార్యభర్తలు. వీరికి ఓ కూతురు, ఓ బాబు ఉన్నారు.

బతుకుదెరువుకు నగరానికి వచ్చారు. సంతోష్‌నగర్‌లో నుస్రత్ మజీద్ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇదే నిర్మాణ భవనంలో శ్రీను నాయక్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రోజూ మాదిరి శనివారం ఉదయం భార్యాభర్తలు పనిలో నిమగ్నమై ఉండగా కొడుకు శివ (5) ఆడుకుంటూ వెళ్లి పిల్లర్ గుంతలో పడి మృత్యువాతపడ్డాడు.

చాలాసేపువరకు తల్లిదండ్రులు గమనించలేదు. బాలుడు కనిపించకపోవడం తల్లిదండ్రులు వెతకగా గుంతలో పడిఉన్నాడు. దీంతో బాబు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సాయంతో బాబును పిల్లర్ గుంతలో నుంచి బయటకు తీసి వైద్యశాలకు తరలించారు. ఐఎస్ సదన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.