25-04-2025 12:54:51 AM
కామారెడ్డి జిల్లా పాల్వంచలో ఘటన
కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా పాల్వంచలో జెసిబి తో తీసిన గుంతలో నాలుగు సంవత్సరాల బాలు డు పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాల్వంచలో గురువారం సాయంత్రం ఆటలాడెందుకు వెళ్లిన బాలుడు జెసిబి తో తీసిన గుంతలో పడి చనిపోయాడు.
ఈ విషయం రాత్రి తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జెసిబి తో గుంత తీసిన వ్యక్తి నష్టపరిహారం ఇప్పించాలని బాలుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అభము,శుభం తెలియని నాలుగు సంవత్సరాల బాలుడు పొక్లున్ తీసిన గుంతలో పడి చనిపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలచి వేసింది.