calender_icon.png 6 January, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరుబావిలో పడిన బాలుడు మృతి

30-12-2024 03:27:59 AM

* 16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం

భోపాల్, డిసెంబర్ 29: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన  బాలు డు(౧౦) సుమీత్ మీనా మృతిచెందా డు. రెస్క్యూ టీమ్ అతన్ని ప్రాణాల తో రక్షించినా.. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ చనిపోయా డు. గుణ జిల్లాలోని పిప్లియాలో సుమీత్ సాయంత్రం 5 గంటల సమయంలో ఆడుకుంటూ వెళ్లి 140 అ డుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన కు టుంబసభ్యులు అధికారులకు తెలియజేశారు.

రిస్క్యూ టీమ్ 16 గంట ల పాటు కష్టపడి బాలుడిని బయట కు తీసింది. స్పృహ తప్పిన బాలుడి ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ చనిపోయాడు. జిల్లా వైద్యాధి కారి డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడు తూ బాలుడు రాత్రంతా చల్లటి వా తావరణంలో ఉండటం వల్ల కాళ్లుచేతులు తడిచి శరీర భాగాలు స్తంభిం చి పోయాయని చెప్పారు. కాగా రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లా లో చేతనత అనే చిన్నారి పొలంలో ఆడుకుంటూ వెళ్లి 700 అడుగుల బోరుబావిలో పడిన విషయం తెలిసిందే.