calender_icon.png 27 March, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట మునిగి బాలుడు మృతి..

23-03-2025 07:11:33 PM

పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్లంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కుర్మ సాయిలు కుమారుడు దుర్గయ్య (12) శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. స్నానం చేసేందుకు స్థానిక రెడ్ల చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. సాయంత్రం ఇంటికి రాక పోయేసరికి కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. ఆదివారం చెరువు వద్ద వెతుకుతుండగా దుర్గయ్య దుస్తులు కనిపించాయి. అనుమానం వచ్చి చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.