calender_icon.png 18 April, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బోల్తా పడి బాలుడు మృతి

10-04-2025 11:19:54 PM

కొండపాక: కుక్కునూరుపల్లి మండలం లకుడారం స్టేజి వద్ద కారు బోల్తా పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మాసాపేట హైదరాబాద్ కు చెందిన రామరం బాబి తన బంధువుల కొడుకు పుట్టు వెంట్రుకల ఫంక్షన్  వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కుక్కునూరు పల్లి మండలం లకుడారం మల్లన్న వనం రాజీవ్ రహదారిపై ఆతివేగంగా వస్తున్న కారు రోడ్డు కిందికి దూసుకుపోయి బోల్తా పడింది.

కారులో ఉన్న బాబి కొడుకు కార్తీక్(7) చాతికి తలకు బలమైన గాయాలు అయ్యాయి. మిగతా వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ ను ఈసీజీ తీసి చూడగా అప్పటికే కార్తీక్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుక్కునూరు పల్లి పోలీసులు తెలిపారు.