calender_icon.png 21 April, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో వాహనం ఢీకొని బాలుడు మృతి

20-04-2025 09:37:46 PM

గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖని మంచిర్యాల్-ప్రధాన రహదారి గంగానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందినట్లు 1- టౌన్ ఎస్ఐ భూమేష్(SI Bhoomesh) ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ఉదయం పులిపాక శివరాజ్ కుమార్(3) ఆడుకోవడానికి ప్రధాన రహదారి పైకి రాగా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన కారు అ బాలుడినీ ఢీకొనడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్ళగా వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి చెందాడని తెలుపగా, తండ్రి పులిపాక రమేష్ ఫిర్యాదు మేరకు(కారు) కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.