నిజామాబాద్ జిల్లా కూర్నపల్లిలో ఘటన
నిజామాబాద్ (విజయక్రాంతి): గాలిపటం ఎగరేయగా ఓ బాలుడు పతంగి చెట్టుకు తట్టుకోగా దానిని తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుర్నాపల్లికి చెందిన మతిన్ (11) ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోమవారం ఉదయం స్కూల్ లేకపోవడంతో ఇంటి వద్ద గాలిపటాన్ని ఎగరవేస్తుండగా చెట్టుకు తట్టుకుంది. తీసేందుకు ఇనుపరాడుతో చెట్టుపైకి వెళ్లి గాలిపటాన్ని తీస్తున్న తరుణంలో పిల్లవాడి చేతిలో ఉన్న ఇనుప రాడు విద్యుత్ తీగకు తగలడంతో కరెంట్ షాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.