calender_icon.png 22 December, 2024 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న అంబులెన్స్.. బాలుడు మృతి

12-09-2024 03:42:49 PM

అంబులెన్స్ లో తరలిస్తున్న బాలుడు మృతి

కామారెడ్డి జిల్లా నర్సింగ్ రావు పల్లి చౌరస్తా వద్ద జరిగిన ఘటన

కామారెడ్డి, (విజయక్రాంతి): విధి ఆడిన వింత నాటకంలో ఓ ఐదు సంవత్సరాల బాలుడు ఓడాడు. కన్నబిడ్డ కళ్ళముందే విలవిల కొట్టుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియకా ఆ దేవుడిపై భారం వేసి దుక్క సాగరంలో మునిగిపోయారు. మహారాష్ట్రలోని డేగౌట్ చెందిన మానే ఉమాకాంత్ కుమారుడు ఐదేళ్ల సాత్విక్ అనారోగ్యానికి గురయ్యాడు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో చికిత్స చేయించాలని మహారాష్ట్రలోని దే గులుర్ లో చికిత్స చేయించాలని నిర్ణయించుకుని గురువారం తెల్లవారుజామున అంబులెన్స్ లో వెంటిలేటర్ పెట్టుకొని ఆ బాలుడిని తీసుకువస్తుండగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ కుట్టి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఆ సమయంలో ఐదు సంవత్సరాల బాబు సాత్వి.క్ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అందుబాటులో ఉన్న 10 33 అంబులెన్స్ ను వారు సంప్రదించగా వచ్చిన అంబులెన్స్ లో వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో చాలా సమయం వరకు అక్కడే వేసి ఉన్నారు .జాతీయ రహదారిపై ఉన్న అంబులెన్స్ ను రప్పించగా అందులోను వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం ఈ క్రమంలో సరైన వైద్య వైద్యము అందక తల్లిదండ్రుల కళ్ళముందే బాలుడు సాత్విక్ కన్నుమూశాడు . ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు రోడ్డు డివైడర్ కు అంబులెన్స్ అదుపుతప్పి వాహనం ఢీ కొట్టింది. డ్రైవర్ ఆ జాగ్రత్తతో నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని దే గ్లూర్ వైపు వెళ్తు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ లో వెంటిలేటర్ పై ఉన్న ఐదు సంవత్సరాల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. బాలుని తండ్రి ఉమాకాంత్ ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని బాలుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. తల్లిదండ్రులు బాలుని చూసి రోదించడం స్థానికులను కలచివేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఐదు సంవత్సరాల బాలుడు సాత్విక్ తల్లిదండ్రుల కళ్ళేదుటే కొట్టుకుంటూ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిన ది.