calender_icon.png 28 January, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సంపులో పడి బాలుడు మృతి

27-01-2025 10:47:52 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): నీటి సంపులో పడి ఆరేళ్ల చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఈ హృదయ విదారక సంఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో బెల్లంపల్లిలో విషాదం నింపింది. శాయంపేటకు చెందిన శుభస్త్రీ అనే మహిళకు బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత ఏడాది ప్రదీప్ కుమార్ మరణించడంతో శుభ శ్రీ శాయంపేట లోని తన తల్లి గారి ఇంట్లో తన ఆరేళ్ల కుమారుడు శివా ఆదిత్య తో కలసి ఉంటుంది. ఆదివారం శుభ శ్రీ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తన కుమారుడు సంపులో పడి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురైంది. చిన్నారి శివ ఆదిత్య మరణ వార్త బెల్లంపల్లిలోని ప్రదీప్ కుమార్ ఇంట్లో తీవ్రవిశ్వాదాన్ని నింపింది.