calender_icon.png 23 October, 2024 | 8:50 AM

అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి

10-07-2024 02:43:01 PM

పెద్దపల్లి,మథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా దవాఖానలో ఓ తండ్రి తనకు జ్వరం రావడంతో చేరాడు. అదే అతని కుమారుడికి ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్లక్ష్యం అ బాలుడికి శాపంగా మారింది. మహబూబాబాద్ కు చెందిన రాములమ్మ శ్రీనివాసు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ కు జ్వరంతో పాటు విరోచనాలు కావడంతో పెద్ద ఆసుపత్రిలో చేరాడు. మంగళవారం అతని బాబు (9)విలియమ్స్ ప్రభుత్వాసుపత్రి ఆడుకుంటూ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు.

గమనించిన సిబ్బంది సెప్టిక్ ట్యాంకు నుండి బాలుడిని వెలికితీశారు. అప్పటికే సెప్టిక్ ట్యాంక్ లోని మురుగునీటిని బాలుడు మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాథమిక చికిత్స జరిపే క్రమంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు హుటాహుటిన కరీంనగర్ కు తరలించారు. విలియమ్స్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందుకు కారకులైన వారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాలుడి కుటుంబానికి 10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.