calender_icon.png 27 October, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టం లేని కటింగ్ చేయించారని 9 ఏండ్ల బాలుడు ఆత్మహత్య

31-05-2024 12:15:10 PM

మహబూబాబాద్ : చిన్న పిల్లలకు ఎమన్నా, ఏం చేసిన పాపమైపోయింది. నేటి యాంత్రిక యుగంలో పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోయారు. తమ లైప్ స్టైల్ ను తమకు నచ్చినట్లే ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా తనకు నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెంలో చోటుచేసుకుంది. చింతగూడెంలో గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు.

ఎండకాలం సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. జట్టు కాస్త పెరగడంతో తండ్రి కటింగ్ షాక్ కి తీసుకెళ్లి హెయిర్ కటింగ్ చేయించాడు. తనకు ఇష్టం లేని కటింగ్ చేయించాడని  మనస్తాపానికి గురైన హర్షవర్ధన్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. కొడుకు మృతితో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.