న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, భారత బాక్సర్ విజేందర్ సింగ్ తండ్రి మహిపాల్ సింగ్ కన్నుమూశారు. కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిని విజేందర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. ‘నా తండ్రి మహిపాల్ సింగ్ ఈరోజు స్వర్గస్తులయ్యారు. ఇది నా జీవితంలో అత్యంత బాధకరమైన విషయం’ అని పేర్కొన్నాడు. కాగా 39 ఏళ్ల విజేందర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మారిన విజేందర్ 14 నాకౌట్ గేమ్స్‌లో 13 గెలిచి ఒకటి మాత్రమే ఓడిపోవడం విశేషం.