calender_icon.png 29 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు మండలాల ఇసుక రీచ్‌లో హద్దులు ఏర్పాటు

29-04-2025 01:01:47 AM

నాగారం, ఏప్రిల్ 28: నాగారం మండల పరిధిలోని పేరబోయినగూడెం  శివారులో బిక్కేరువాగు లోమన ఇసుక మన వాహనం పాలసీ హద్దులు దాటి ఇసుకను తోడుతున్నారని శనివారం పర్మిషన్ ఒకచోట ఎత్తేది మరోచోట అనే కథనంపత్రికల్లోరావడంతో సోమవారం స్థానిక తహసిల్దార్ బ్రహ్మయ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ప్రకాష్ ఆధ్వర్యంలోభిక్కేరు వాగులో సర్వే చేసి జాజిరెడ్డిగూడెం, నాగారం మండల ల మధ్య హద్దులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగారెండు గ్రామాల రైతులువాదోపవాదాలకు దిగినట్లుగా సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకునచ్చజెప్పిహద్దులు దాటి ఇసుక తోడుతున్నవారిని అక్కడ నుండి పంపించేశారు.ఇసుక రీచ్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్వో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే హద్దులుదాటి ఇసుకను ఎత్తారని రైతులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా విధులునిర్వహించిన ఎస్‌ఆర్‌ఓ పై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మన ఇసుక మన పాలసీ ద్వారా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో ఇసుక రవాణా జరగాలి కానీఎస్ ఆర్‌ఓ నిర్లక్ష్యంతో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.