హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే రాజయ్య అనే వ్యక్తితో పాటు పట్టణ పరిధిలోని దుర్గ కాలనీకి చెందిన సంపత్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనం (ఎక్స్ఎల్) పై వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో జమ్మికుంట నుండి (టీఎస్ 02 ఎఫ్ఈ 0567) గల కారు బలంగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. రాజయ్య కాలు విరగగా, సంపత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి.
స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో, వెంటనే 108 ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల ప్రథమ చికిత్స అనంతరం వారి సూచన మేరకు వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ వైద్యురాలు కారుగా ప్రచారం సాగుతుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఓరుగంటి రవి తెలిపారు.