calender_icon.png 26 December, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రెండు పాటలూ నా కెరీర్‌లో మైలురాళ్లు

22-12-2024 12:00:00 AM

‘పుష్ప2’ టైటిల్ సాంగ్, జాతర పాట ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి మాస్టర్ శనివారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “పుష్ప2’ టైటిల్ సాంగ్, జాతర పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే -చాలా హ్యాపీగా అనిపిస్తోంది. దీంతో కొరియోగ్రాఫర్‌గా నా బాధ్యత పెరిగిందనుకుంటున్నా. నా కెరీర్‌లో అవి మైల్ స్టోన్‌గా నిలిచిపోతాయి.  నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ ‘కొబ్బరి మట్ట’ సినిమాలోని ‘అఆ ఇఈ..’. తర్వాత ‘పలాస’లో అన్ని పాటలూ చేశాను. అందులో ‘నిక్కిలీసు గొలుసు’ పాట వైరల్ హిట్ అయ్యింది. అప్పుడే సుకుమార్, బన్నీ దగ్గరికి నా ప్రొఫైల్ వెళ్లింది. నా డెమోస్ చూసి పిలిచారు. అప్పటికే వారు గణేశ్ ఆచార్య మాస్టర్ అని ఫిక్స్ అయ్యారు. అయినా ఆ మాస్టర్‌ను కన్విన్స్ చేసి నన్ను కూడా మాస్టర్‌గా తీసుకున్నారు” అని చెప్పారు విజయ్ మాస్టర్. ఇంకా తన అప్ కమిం గ్ ప్రాజెక్టుల గురించీ వివరించారు.