calender_icon.png 23 December, 2024 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హైడ్రా’కు రెండువైపులా పదును

27-08-2024 12:00:00 AM

ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా వేగంగా దూసుకుపోతున్న ‘హైడ్రా’ వాస్తవానికి రెండు వైపులా పదునైనా కత్తి వంటిది. నిజాయితీ, పారద్శరకత, నిష్పాక్షికత వంటివి ఏ మాత్రం లోపించినా ఫలితం పాలక పక్షానికే నష్టదాయకం అవుతుంది. దీనిని గ్రహించి అధికారులు పక్షపాత రహితంగా వ్యవహరించాలి. ఆక్రమణదారులు ఏ పక్షం వారైనా క్షమించాల్సిన పనిలేదు. నిజమైన ఆక్రమణలపై నిర్దాక్షిణ్యంగా కొరడా ఝులిపించాలి. దీంతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలనూ అధికారులు తొలగించాలి. దీనివల్ల పాదచారులకు ఎంతో మేలు చేసిన వారవుతారు.  

 జీఎన్ మూర్తి, హెచ్‌ఎంటీ నగర్